Nandita Swetha: బెడ్‌పై పడుకొని కొంటె చూపులతో వయ్యారాలు ఒలకబోస్తున్న హాట్ బ్యూటీ

by Pulgam srinivas |   (  Updated:2026-04-16 16:09:13  IST  )

చీర కట్టులో మెరిసిన నందిత శ్వేత… స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఆకట్టుకున్న బ్యూటీ

Nandita Swetha: బెడ్‌పై పడుకొని కొంటె చూపులతో వయ్యారాలు ఒలకబోస్తున్న హాట్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: నందిత శ్వేత 'నంద నందితను ప్రేమిస్తున్నాడు' అనే కన్నడ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. అనంతరం ఈ నటి 2016లో విడుదలైన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.




ఈ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు, ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ చిత్రం ద్వారా నందితకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుసగా తెలుగులో అనేక చిత్రాల్లో అవకాశాలు దక్కాయి.




ఈమె కేవలం కన్నడ, తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియాలో కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.




తాజాగా ఈ క్రేజీ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలలో ఈమె వైట్ కలర్ చీర కట్టుకుని, రెడ్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి, బెడ్‌పై ఒక పుస్తకం పట్టుకుని పడుకుని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.




ఇందులో ఈమె చేతికి గాజులు ధరించి, ఆకర్షణీయమైన ఇయర్‌ రింగ్స్ పెట్టుకుని, తన అందమైన కురులు హైలైట్ అయ్యేలా పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చీర కట్టులో, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో కనిపించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story