Kalyanram: కాకినాడ‌లో రెస్టారెంట్ ప్రారంభించిన క‌ళ్యాణ్ రామ్

by velandi.Saikiran |

తన మేనల్లుడి రెస్టారెంట్ ఓపెనింగ్ కోసం కాకినాడ వెళ్లారు నందమూరి కళ్యాణ్ రామ్. కాకినాడలో ఉదయ్ కేఫ్ పేరుతో తన మేనల్లుడు కొత్తగా రెస్టారెంట్ పెట్టాడు. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమం నందమూరి కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా జరిగింది.

Kalyanram: కాకినాడ‌లో రెస్టారెంట్ ప్రారంభించిన క‌ళ్యాణ్ రామ్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో కళ్యాణ్ రామ్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో మెరిసిన కళ్యాణ్ రామ్, మరో రెండు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. ఇందులో బింబిసార 2 సినిమా కూడా ఉంది. బింబిసారా మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్ట్ 2 కూడా తీస్తున్నాడు కళ్యాణ్ రామ్.

దీంతో పాటు శ్రీకాంత్ విస్సా అనే కొత్త దర్శకుడుతో యాక్షన్ మూవీ చేస్తున్నట్లు సమాచారం. అయితే అలాంటి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన మేనల్లుడి రెస్టారెంట్ ఓపెనింగ్ కోసం కాకినాడ వెళ్లారు నందమూరి కళ్యాణ్ రామ్. కాకినాడలో ఉదయ్ కేఫ్ పేరుతో తన మేనల్లుడు కొత్తగా రెస్టారెంట్ పెట్టాడు. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమం నందమూరి కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. క్లిక్

Next Story