35 ఏళ్ల తర్వాత నందమూరి హీరో రీఎంట్రీ

by Malleboina Mahesh |

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్‌లో ఎంతో పేరు ఉన్న నందమూరి కుటుంబానికి చెందిన ఓ హీరో.. 35 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

35 ఏళ్ల తర్వాత నందమూరి హీరో రీఎంట్రీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్‌లో ఎంతో పేరు ఉన్న నందమూరి కుటుంబానికి (Nandamuri family) చెందిన ఓ హీరో.. 35 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ (Re-entry) ఇచ్చారు. ఒకప్పటి హీరో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy) మళ్లీ వెండితెరపైకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు, నిర్మాత త్రివిక్రమరావు కుమారుడైన ఈయన, రోషన్ హీరోగా తెరకెక్కుతున్న 'ఛాంపియన్' సినిమా ('Champion' movie)లో రాజిరెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఒక ప్రత్యేక వీడియోను కూడా పంచుకుంది. గతంలో కళ్యాణ్ చక్రవర్తి 'అక్షింతలు', 'దొంగ కాపురం', 'ఇంటి దొంగ', 'మారణ హోమం', 'తలంబ్రాలు', చిరంజీవి నటించిన 'లంకేశ్వరుడు' వంటి పదికిపైగా చిత్రాల్లో హీరోగా, సహాయ నటుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

సినిమా రంగంలో మంచి కెరీర్ ఉంటుందనుకుంటున్న తరుణంలో, ఆయన కుటుంబంలో జరిగిన రోడ్డు ప్రమాదం (సోదరుడు హరీన్ చక్రవర్తి, కొడుకు పృథ్వి మరణించడం), తండ్రి అనారోగ్యం కారణంగా ఆయన నటనకు దూరమై, చెన్నైలోనే ఉంటూ వ్యాపారాలు చూసుకున్నారు. సుమారు మూడు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న కళ్యాణ్ చక్రవర్తి, ఇప్పుడు మళ్లీ 'ఛాంపియన్' సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడం నందమూరి అభిమానులకు సంతోషాన్ని ఇచ్చే విషయంగా చెబుతున్నారు.

Next Story