Daku Maharaj: మైండ్ బ్లోయింగ్ బ్రో.. ఓ రేంజ్‌లో సినిమా..!

by Vemula.Srinu Prasad |

నందమూరి నట సింహం బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ సంక్రాంతి సందడి మొదలైంది..

Daku Maharaj: మైండ్ బ్లోయింగ్ బ్రో.. ఓ రేంజ్‌లో సినిమా..!
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నట సింహం బాలయ్య(Nandamuri Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సంక్రాంతి(Sankranti) సందడి మొదలైంది. దర్శకుడు బాబీ(Director Babi) కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ఇది. హీరో బాలయ్యను గతంకంటే ఈ సినిమాలో మరింత యాక్టివ్‌‌గా చూపించారు ప్రయోగాల్లో ఫస్ట్ ఉండే ఆయనను దర్శకుడు కంప్లీట్‌గా వినియోగించుకోవడంతో షూటింగ్ స్టార్ట్ నుంచే సినిమాపై ఫుల్ బజ్ ఏర్పడింది. ప్రమోషన్‌‌లో ఊపు చూపించకపోయినా సినిమా ట్రైలర్, టీజర్, బాలయ్య ఫొటోస్, పోస్టర్స్, పిక్స్ చూసిన ప్రేక్షక జనాల్లో కచ్చితంగా హిట్ అనే ముద్ర పడింది. ప్రస్తుతం అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో దబిడిదిబిడి చూపించేందుకు సిద్ధమైంది.

కథాంశం సూపర్


‘డాకు మహారాజ్’ మూవీని దర్శకుడు బాబీ తెరకెక్కించారు. నాగ వంశీ నిర్మాత(Producer). సంగీత దర్శకుడు థమన్(Music Director Thaman). బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటించారు. ప్రతినాయకుడి పాత్రలో బాబీ డియోల్(Bobby Deol) కనిపించారు. చారిత్రక నేపథ్యమున్న బలమైన కథతో రూపొందిన మూవీగా ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ కూడా కన్ఫార్మ్ చేసింది. అదిరిపోయే సీన్స్‌తో మూవీ అందరినీ కట్టిపాడేస్తుందని స్పష్టం చేసింది. ఈ సినిమాలో బాలయ్యను బందిపోటుగా చూపించినట్లు ఇప్పటికే ట్రైలర్‌తో లీక్ చేశారు. డబ్బున్న వాళ్ల నుంచి దోచుకుని పేదలకు పంచడమే సినిమా కథాంశంగా ట్రైలర్‌లో చూపించారు. మూడు షేడ్స్‌లో చూపించిన విధానం ప్రేక్షకులను ఆకర్షించింది.

ఆ సీన్స్ హైలెట్


మరీ ముఖ్యంగా డాకు మహారాజ్, చిన్నారి మధ్య జరిగిన సీన్స్‌ను పండించారు. ట్రైలర్ స్టార్టింగ్‌లోనూ అదే ఉంది. చెడు వ్యక్తులు డాకు అంటారని, మాకు మాత్రం ఆయన డాకు మహారాజ్ అని వాయిస్ బ్యాక్ గ్రౌండ్‌లో చిన్నారి చెప్పిన డైలాగ్ అదుర్స్ అనిపింది. యాక్షన్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. 2 గంటల 32 నిమిషాల పాటు ప్రేక్షకులను లాక్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఇక సినిమా టైటిల్ సాంగ్ అదిరిపోయింది. గుర్రాలపై బాలయ్య పోరాటం చేస్తున్న దృశ్యాలు అదుర్స్ అనిపించాయి. దబిడిదిబిడి సాంగ్‌పై విమర్శలు వచ్చినా ట్రెండీగా నిలిచింది.

డాకు టైటిల్ వెనుక రహస్యం ఇదే




ఇక ‘డాకు మహారాజ్’ టైటిల్‌కు సంబంధించిన సస్పెన్స్‌కు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య బయటకు చెప్పారు. 1991లో వచ్చిన ఆదిత్య 369 చిత్రం నుంచి ఈ కథాంశం పుట్టిందని తెలిపారు. ఆ సినిమాలోని కృష్ణదేవరాయలు పాత్ర చిరస్థాయిలో నిలిచిపోయిందని, అందుకే ఈ సినిమాలోనే అలాంటి పాత్ర చేశానని, ఈ నేపథ్యంలో మూవీ టైటిల్‌కు డాకు మహారాజ్ ఫిక్స్ చేశామని బాలయ్య చెప్పారు.

‘డాకు’కు అన్ని కలిసొచ్చాయి..


మరోవైపు ‘డాకు మహారాజ్‌’కు అన్ని కలిసొచ్చాయి. పుష్పా-2 ఇన్సిడెంట్ నుంచి కొద్దిగా ఎఫెక్ట్ ఉన్నా తెలుగు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం అయితే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. టికెట్స్ విషయంలో చిత్ర యూనిట్ ఇష్టానికే వదిలేసింది. బెనిఫిట్ షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 9 రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం అటు కోర్టు కూడా కల్పించింది.

సెఫ్ జోన్‌లో ‘డాకు’ బిజినెస్


దర్శకుడు బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య తెలుగు ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టారు. బాలయ్య గత మూడు సినిమాలు అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు ముందు రూ. 83 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మరో 84 కోట్లు హిట్ పడినట్టేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు.

బాలయ్య విశ్వరూపం.. దబిడిదిబిడే..


మరోవైపు సినిమా విడుదలకు సర్వంసిద్ధమైంది. బొమ్మ దబిడిదిబిడి గ్యారంటీ అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. సంక్రాంతి బాక్సాఫీసు బొనాంజాగా పేరున్న బాలయ్య అన్ని సినిమాల రికార్డ్స్ తిరగరాస్తుందని అంచనా వేస్తు్న్నారు. మరి బాలయ్య విశ్వరూపం ఏంటో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. చూడాలి ఏం జరుగుతోంది.

Next Story