- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Namratha Shirodkar : ప్రియాంకా చోప్రాకు నమ్రత స్పెషల్ థాంక్స్
మాజీ ప్రపంచ సుందరి, భారత ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా(Priyanka Chopra)కు నమ్రతా శిరోద్కర్(Namrata Shirodkar) స్పెషల్ థాంక్స్ తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ప్రపంచ సుందరి, భారత ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా(Priyanka Chopra)కు నమ్రతా శిరోద్కర్(Namrata Shirodkar) స్పెషల్ థాంక్స్ తెలిపారు. ఇటీవల ఒక చిన్న వెకేషన్ కోసం ఇటలీ వెళ్ళిన మహేష్ బాబు- నమ్రతా కుటుంబ సభ్యులను(Mahesh Babu) తన ఇంటికి ఆహ్వానించింది ప్రియాంక. వారికి ప్రత్యేక విందు ఇవ్వడమే కాకుండా.. తన భర్త నిక్ జొనాస్(Nick Jonas) నటించిన 'ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్'(The Last Five Years) సినిమాను ప్రత్యేకంగా షో వేసి చూపించింది. అందుకుగాను సంతోషం వ్యక్తం చేస్తూ.. ప్రియాంకకు స్పెషల్ థాంక్స్ చెబుతూ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా పోస్ట్ పెట్టింది నమ్రత.
నిక్ జొనాస్ తో కలిసి దిగిన ఓ ఫోటో షేర్ చేస్తూ.. ఇంత మంచి సాయంత్రాన్ని, అద్భుతమైన షోను అందించినందుకు ధన్యవాదాలు అని రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో ప్రియాంక లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చిన్న విరామం రావడంతో మహేష్ దంపతులు వెకేషన్ కు ఇటలీ, న్యూయార్క్ వెళ్లారు.






