- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నా మార్గదర్శక నక్షత్రాలుగా ఉన్నందుకు ధన్యవాదాలు’.. ఫొటోలు పంచుకుంటూ సూపర్‌స్టార్ సతీమణి ఆసక్తికర పోస్ట్
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu)ఫ్యామిలీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu)ఫ్యామిలీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. సినిమాల్లో నటించే క్రమంలోనే నటి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) అండ్ ఈ హీరో ప్రేమలో పడ్డారు. బి. గోపాల్ దర్శకత్వం వహించిన వంశీ చిత్రంలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ చిత్రాన్ని పద్మాలయా స్టూడియోస్ నిర్మించింది ఈ చిత్రంలో కృష్ణ , సూపర్ స్టార్ మహేష్ బాబు , నమ్రతా శిరోద్కర్ నటించారు.
మణి శర్మ సంగీతం సమకూర్చారు. కాగా కొద్ది రోజులకు పెద్దలను ఒప్పించి.. ఇద్దరి కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు చిహ్నంగా గౌతమ్ అండ్ సితార జన్మించారు. సితార, గౌతమ్ సోషల్ మీడియాలో అభిమానులతో తరచూ టచ్‌లోనే ఉంటారు. ఈ వయస్సులోనే హీరో, హీరోయిన్ లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడం విశేషం.
ఇప్పటికే నాన్న సూపర్‌స్టార్ చిత్రంలో కుమారుడు గౌతమ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. సితార కూడా మహేష్ బాబు మూవీలో ఓ సాంగ్‌లో స్టెప్పులేసింది. ఇకపోతే సూపర్ స్టార్ అండ్ నమ్రత ఇన్నేళ్ల జర్నీలో ఎప్పుడూ హ్యాపీగానే గడిపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అనేక మంది వీరిద్దరి అన్యోన్యమైన జంటగా చెప్పుకుంటారు. వివాహనంతరం నమ్రత పూర్తిగా సినిమాలకే దూరం అయ్యింది. పిల్లల్ని, ఫ్యామిలీ బాధ్యతల్ని చూసుకుంటూ ఉత్తమ కోడలిగా పేరు సంపాదించుకుంటుంది.
అయితే నేడు ఉమెన్స్ డే సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ఈ ఫొటోలో కుమార్తె సితారతో పాటుగా నమ్రత సన్నిహితుల ఫొటోలు పంచుకుంది. ఈ పిక్స్‌కు ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘‘మీరు ఉన్నారు కాబట్టే నేను ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరూ నా ఆత్మపై ఒక ముద్ర వేశారు.
నన్ను ఈ రోజు నేను ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దారు. మీరు నాకు స్థితిస్థాపకత, దయ, ప్రేమ శక్తిని నేర్పించారు. ఈ రోజు, ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని మర్చిపోను. నా మార్గదర్శక నక్షత్రాలుగా ఉన్నందుకు ధన్యవాదాలు. నేను మీ అందరినీ మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’’. అంటూ నమ్రత రాసుకొచ్చింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Read More ....
ఉమెన్ స్పెషల్స్.. దేశానికి తెలంగాణ ఉత్పత్తులను పరిచయం చేస్తున్న మహిళా స్టాల్స్






