- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NAKED.. అందరూ అలాగే ఉండాలంటున్న శ్రీలీల.. షాకింగ్ వీడియో వైరల్
యంగ్ బ్యూటీ శ్రీలీల( sreeleela) ‘పెళ్లి సందడి’ (Pelli Sandadi) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రీలీల( sreeleela) ‘పెళ్లి సందడి’ (Pelli Sandadi) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రవితేజ (raviteja) ‘ధమాకా’(Dhamaka) సినిమాతో హిట్ సాధించి తన క్రేజ్‌ను పెంచుకుంది. దీంతో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసి క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే శ్రీలీలకు వరుసగా నాలుగు ఫ్లాప్స్ ఎదురుకావడంతో వచ్చిన క్రేజ్ కాస్త తగ్గిపోయింది. అంతేకాకుండా అవకాశం ఇచ్చిన ప్రాజెక్ట్స్ నుంచి కూడా తొలగించారు. దీంతో కొన్ని రోజుల పాటు డాక్టర్ చదివిన ఈ భామ పలు యాడ్స్ కూడా చేసింది. ఆ తర్వాత ‘పుష్ప-2’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇందులో కిస్సిక్ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులేసి అందరి దృష్టి తనవైపుకు తిప్పుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. మళ్లీ గతంలో ఉన్నంత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉంటుంది. అయితే ఈ అమ్మడు ఓ స్కిన్ కేర్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు సమాచారం. నేక్డ్ అనే పేరు ఉన్న ఈ బ్రాండ్ గురించి ఇటీవల రానా దగ్గుబాటి షోలోనూ వివరించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్ చేసింది.
ఇందులో యాంకర్ అసలు నిన్ను అభిమానులు ఎలా ఆదరిస్తారు అని ప్రశ్నించగా.. దానికి ఆమె ది రియల్ నేక్డ్ అని చెప్పడంతో యాంకర్ షాక్ అవుతాడు. అయినప్పటికీ మళ్లీ అడగడంతో అవును నేను చెప్తుంది నిజమే.. ప్రజలు దానిని ఇష్టపడతారు అంటుంది. అయితే నెక్డ్ అంటే ఆమె బ్రాండ్ పేరు అన్న విషయం తెలిసిందే. అందరూ అలాగే ఉండాలని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సడెన్‌గా చూసిన వారు కొందరు న్యూడ్‌గా ఉండటాన్ని ఇష్టపడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం ఆమె బ్రాండ్ గురించి చెప్తుందని అంటున్నారు.






