- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vrushakarma: చైతూ కోసం నాగవంశీ అన్ని కోట్లు రిస్క్
నాగ వంశీ 'వృషకర్మ' ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక హక్కులను 45 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దిశ, వెబ్ డెస్క్: చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే నిర్మాతలు ఎక్కువ శాతం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేవారు కాదు. పెద్ద నిర్మాతలకు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవారు, వారు ఏదైనా సినిమాను నిర్మిస్తే ఎక్కువ, తక్కువ తేడాలతో ఒక ఏరియాకు ఒకరిని ఎంచుకొని వారికి హక్కులను ఇచ్చేవారు, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చి మంచి స్థాయికి చేరుకున్న వారు ఎంతోమంది డిస్ట్రిబ్యూషన్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. అందులో నాగ వంశీ ఒకరు. ఈయన సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించాడు.
ప్రస్తుతం ఎన్నో సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈయన కేవలం సినిమాలను ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాకుండా ఇతర నిర్మాతలు నిర్మించిన సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నాడు. కొంతకాలం క్రితం ఈ నిర్మాత 'దేవర పార్ట్ 1', 'వార్ 2' లను డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇందులో దేవర ద్వారా ఈయనకు లాభాలు వచ్చిన వార్ 2 ద్వారా మాత్రం లాభాలు రాలేదని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ నిర్మాత మరో సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
నాగ వంశీ, నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వృషకర్మ యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక హక్కులను 45 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దానితో నాగ వంశీ పెద్ద రిస్క్ చేస్తున్నాడు, టాక్ ఏ మాత్రం తేడా కొట్టిన ఆయనకు నష్టాలు వస్తాయి అని కొంతమంది అభిప్రాయపడుతుంటే, మరి కొంతమంది మాత్రం ఆయన సినిమా గురించి అన్నీ తెలుసుకునే అంత ధరకు కొనుగోలు చేసి ఉంటాడు. కచ్చితంగా ఆ మూవీతో పెద్ద మొత్తంలో లాభాలను అందుకుంటాడు అని అంచనా వేస్తున్నారు.






