Nagarjuna: అక్కినేని కుటుంబానికి మూలస్తంభం.. ఆయన ఇకలేరంటూ నాగార్జున ఎమోషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna) ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు.

Nagarjuna: అక్కినేని కుటుంబానికి మూలస్తంభం.. ఆయన ఇకలేరంటూ నాగార్జున ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna) ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. పలు విషయాలను తన అభిమానులు తెలుపుతూ వారితో ముచ్చటిస్తున్నారు. అయితే ఇటీవల అక్కినేని అఖిల్(Akkineni Akhil), జైనబ్ నిశ్చితార్థం గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, నాగార్జున ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అక్కినేని కుటుంబానికి వీరాభిమాని అయిన అయ్యప్ప రెడ్డి(Ayyappa Reddy) మృతి చెందినట్లు తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చారు. ‘‘తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సడెన్‌గా యద్దుల అయ్యప్పరెడ్డి మరణించినందుకు చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే.. అతను మా నాన్నగారు ANR గారికి వీరాభిమాని. అంతేకాకుండా అక్కినేని కుటుంబానికి మూలస్తంభం. మా పట్ల ఆయన చూపిన ప్రేమ, ఆప్యాయత ఎన్నటికీ మరువలేము. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, ఈ కష్ట సమయాల్లో దేవుడు వారికి శక్తిని ప్రసాదిస్తాడు’’ అని అన్నారు. కాగా, నాగార్జున సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికీ వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు.

గత ఏడాది ‘నా సామి రంగా’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘కూలీ’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ‘కుబేర’ చిత్రంలో ధనుష్(Dhanush), నాగార్జున హీరోలుగా నటిస్తుండగా.. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. రీలీజ్‌కు సిద్ధంగా ఉంది. కానీ మూవీ మేకర్స్ గత కొద్ది రోజుల నుంచి ఎలాంటి అప్డేట్స్ విడుదల చేయకపోవడంతో అసలు ‘కుబేర’ ఉందా లేక మధ్యలోనే ఆగిపోయిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story