- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kubera: నాగార్జున డబ్బింగ్ షురూ.. వైరల్ అవుతోన్న ఫొటోస్
తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’.

దిశ, సినిమా: తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’. క్లాసిక్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో అప్డేట్ పంచుకున్నారు మూవీ టీమ్. ఈ సినిమా విడుదలకు ఇంకా 13 రోజులే ఉండడంతో శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది చిత్రయూనిట్. అంతే కాకుండా.. డబ్బింగ్ పనులు కూడా జెట్‌స్పీడ్‌లో జరుగుతుండగా.. నాగార్జున తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
KING @iamnagarjuna garu wraps his dubbing for #Kuberaa ✨
— Suresh Kondeti (@santoshamsuresh) June 7, 2025
Get ready to witness his power-packed presence from June 20th🔥
In cinemas June 20, 2025.#SekharKammulasKuberaa #KuberaaOn20thJune @dhanushkraja@iamRashmika @jimSarbh @sekharkammula @ThisIsDSP @AsianSuniel… pic.twitter.com/R0dvLP2CDB






