- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ రూపు రేఖలు మార్చిన సినిమా రీరిలీజ్.. ఆగష్టు 14న ట్రైలర్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని నాగార్జు(Akkineni Nagarjuna), రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కాంబినేషన్ వచ్చిన శివ సినిమా(Shiva Movie)కు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని నాగార్జు(Akkineni Nagarjuna), రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కాంబినేషన్ వచ్చిన శివ సినిమా(Shiva Movie)కు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. 1990లో వచ్చిన ఈ చిత్రం.. టాలీవుడ్ రూపురేఖల్ని మార్చేసిందని స్వయంగా దర్శకులు, హీరోలే చెబుతుంటారు. ఇండస్ట్రీని శివకు ముందు.. శివ తర్వాత అని మాట్లాడుకోవడమే ఇందుకు నిదర్శనం. ఈ సినిమాలోని పాటలు, ఫైట్లు, సీన్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ అనే ఒక విలక్షణ దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
అయితే.. నాగార్జునను, శివ సినిమాను ఇష్టపడే వారికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుభవార్త చెప్పారు. శివ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేశారు. 4K డాల్బీ అట్మోస్‌తో రీ-రిలీజ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించాడు. అయితే, ఈ చిత్ర రీ-రిలీజ్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’తో పాటు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అక్కినేని నాగార్జున పేర్కొన్నారు.






