Akhil: అఖిల్ కోసం ఆ పని చేస్తున్న నాగార్జున.. నెట్టింట వైరల్‌గా మారిన ట్వీట్

by Chukka Sudharani |

అక్కినేని హీరో అఖిల్ (Akhil) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ (Lenin).

Akhil: అఖిల్ కోసం ఆ పని చేస్తున్న నాగార్జున.. నెట్టింట వైరల్‌గా మారిన ట్వీట్
X

దిశ, సినిమా: అక్కినేని హీరో అఖిల్ (Akhil) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ (Lenin). మురళీ కిశోర్ అబ్బూరు (Murali Kishor Abburu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో నిఖిల్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఇందులో వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా.. అఖిల్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క హిట్ కూడా పడకపోవడంతో అఖిల్‌తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే అఖిల్‌కు ఈ సినిమా ఓ మంచి హిట్ ఇవ్వాలని ఆశిస్తున్న అక్కినేని నాగార్జున.. తన కొడుకు కోసం ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటించాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగా లెనిన్‌లో నాగార్జున్ ఓ శక్తివంతమైన పాత్రలో కనించనున్నారని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. ఈ సినిమాలో తన ప్రత్యేక పాత్రతో అఖిల్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలని నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్‌కు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సి ఉంది.

Twitter Link

Next Story