- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'బైకర్'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగార్జున
'బైకర్'పై అక్కినేని నాగార్జున ప్రశంసలు.. శర్వానంద్ పడిన కష్టానికి ఫలితం దక్కింది.

దిశ, వెబ్ డెస్క్: మన తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన అనేక మంది హీరోలు, ఇతర నటుల సినిమాలు విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందితే వాటిపై పాజిటివ్‌గా స్పందించడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. తాజాగా టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ హీరోగా నటించిన 'బైకర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను అందుకుంటోంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 3వ తేదీన విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాపై టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించడం విశేషంగా మారింది. నాగార్జున తన సోషల్ మీడియా వేదికగా... 'బైకర్' ఒక మంచి చిత్రం. దర్శకుడు అభిలాష్ రెడ్డి కుటుంబ భావోద్వేగాలను, సంబంధాలను ఎంతో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా సినిమాలోని రేసింగ్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉండి, ఈ చిత్రానికి అవి అదనపు ఆకర్షణగా నిలిచాయని అన్నారు.
అలాగే హీరో శర్వానంద్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని, అది తెరపై స్పష్టంగా కనిపిస్తోందని, సినిమా మొత్తం యూనిట్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా మాళవిక నాయర్ నటించగా, సీనియర్ నటుడు రాజశేఖర్ కీలకమైన పాత్రలో కనిపించారు. అలాగే బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్ నిర్మించారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.






