- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగబంధంపై ఇన్ని అంచనాలా.. ఒక్కసారిగా అంతా మారిపోయిందా
వరల్డ్ ఆఫ్ నాగబంధం టీజర్ విడుదలైన 24 గంటల్లో 12.35 మిలియన్ వ్యూస్ మరియు 83K లైక్స్ లభించాయి.

దిశ, వెబ్ డెస్క్ : విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ హీరోయిన్‌గా నాగబంధం అనే సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. జగపతిబాబు, మురళి శర్మ, అనసూయ, మహేష్ మంజ్రేకర్ ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అభిషేక్ నామ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా.. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత అన్నపురెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.
గత కొంతకాలంగా ఈ మూవీకి సంబంధించిన ఔట్‌పుట్ అద్భుతంగా వస్తుందని, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యాక ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరుగుతాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు వరల్డ్ ఆఫ్ నాగబంధం పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. 2:31 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేదు. కాకపోతే ప్రతి ఫ్రేమ్ కూడా హైలైట్‌గా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఈ మూవీ బృందం వారు గ్రాఫిక్స్ సన్నివేశాలపై చాలా శ్రద్ధ వహించినట్లు క్లియర్‌గా అర్థమవుతుంది.
ఈ సినిమా నుండి టీజర్ బయటికి వచ్చాక అంచనాలు అమాంతం పెరిగిపోతాయని వార్తలు వచ్చాయి. అందుకు ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమాకు సంబంధించిన వరల్డ్ ఆఫ్ నాగబంధం వీడియో ఉండడంతో జనాలు కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచుకున్నారు. మరి తాజాగా ఈ చిత్రం బృందం వారు విడుదల చేసిన స్థాయిలోనే మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లయితే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసి విజయాన్ని అందుకునే అవకాశాలు ఉంటాయని చాలామంది భావిస్తున్నారు. ఇక వరల్డ్ ఆఫ్ నాగబంధం వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో 12.35 మిలియన్ వ్యూస్, 83K లైక్స్ లభించాయి.






