- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవ్వరూ ఊహించని రన్‌టైమ్‌తో నాగబంధం!
నాగబంధం సినిమా ఏకంగా 3 గంటల 17 నిమిషాల భారీ రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: పెద్దకాపు సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమైన విరాట్ కర్ణ ప్రస్తుతం నాగబంధం అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా కనిపించనుండగా అభిషేక్ నామ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోవడంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాగబంధం సినిమా ఏకంగా 3 గంటల 17 నిమిషాల భారీ రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇంత పెద్ద రన్‌టైమ్‌తో సినిమాలను విడుదల చేయడంలో మేకర్స్ కొంత వెనకడుగు వేస్తుంటారు. సినిమా ఏ మాత్రం బోర్ కొట్టినా నెగటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుందనే భావన ఇందుకు ప్రధాన కారణం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ రన్‌టైమ్‌తో సిద్ధం చేయడం చూసి ఇందులో కచ్చితంగా మంచి గ్రిప్పింగ్ స్టోరీ, బలమైన స్క్రీన్‌ప్లే ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి నాగబంధం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభే సంగీతం అందిస్తున్నారు.






