నాగబంధం క‌థ ఇదేనా..అనంత పద్మనాభ స్వామి రేంజ్ లో!

by velandi.Saikiran |   (  Updated:2026-02-02 15:08:57  IST  )

ఫిబ్రవరి 15వ తేదీన ఈ నాగబంధం సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

నాగబంధం క‌థ ఇదేనా..అనంత పద్మనాభ స్వామి రేంజ్ లో!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: చిత్ర పరిశ్రమలో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు సక్సెస్ అవుతుంటే మరికొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో క్రైమ్, హారర్, డివోషనల్ సస్పెన్స్ , మిస్టరీ నేపథ్యంలో వచ్చిన సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి. చాలా రోజులుగా హిట్ కోసం ప్రయత్నించిన ఆది కూడా ఇలా డిఫరెంట్ సినిమాతో సక్సెస్ అయ్యారు. అయితే అందులో భాగంగానే ఇప్పుడు నాగబంధం ( Nagabandham ) అనే కొత్త టైటిల్ తో సినిమా వస్తోంది.

నాగబంధం.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అదిరిపోయే మూవీ

విరాట్ కర్ణ ( (Virat Karna)), నవ నటేష్ ( nabha natesh ), ఐశ్వర్య మీనన్ ( ishwarya menon) ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న సినిమానే ఈ నాగబంధం. ట్యాగ్ లైన్ ది సీక్రెట్ ట్రెజర్. ఈ మూవీలో మురళీ శర్మతోపాటు జగపతి బాబు స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి, పురాతన భారతీయ దేవాలయాలలో రహస్య నిధుల చుట్టూ జరిగే యదార్థాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. అయితే ఈ రహస్య నిధుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను పానీ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది చిత్ర బృందం.

ఈ నాగబంధం ( Nagabandham ) సినిమాకు అభిషేక్ నామ దర్శకత్వం వహిస్తుండగా, నిషిత నాగిరెడ్డి, కిషోర్ అన్నపురెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే వేసవిలో మలయాళం, తెలుగు తమిళం కన్నడ అలాగే హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. మహాశివరాత్రి అంటే ఫిబ్రవరి 15వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. దీనికి తగ్గట్టుగానే నాగుపాముతో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. మ‌రి ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు ఎలా ఆదిరిస్తారో చూడాలి.

Couple Friendly Trailer: ఒకే రూంలో ల‌వ‌ర్స్‌..ముద్దులు, హగ్గులు..ఇర‌గ‌దీసిన సంతోష్ శోభ‌న్‌

Next Story