'నాగబంధం' ఓటీటీ డీల్ క్లోజ్.. సినిమా చూసి మరీ అన్ని కోట్లు పెట్టిన ప్రముఖ సంస్థ

by Pulgam srinivas |

ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ వారు సుమారు 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

నాగబంధం ఓటీటీ డీల్ క్లోజ్.. సినిమా చూసి మరీ అన్ని కోట్లు పెట్టిన ప్రముఖ సంస్థ
X

దిశ, వెబ్ డెస్క్: విరాట్ కర్ణ, నభా నటేష్ జంటగా రూపొందుతున్న నాగబంధం చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్లు వెలువడుతున్నాయి. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని జూలై 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై జనాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ కూడా కుదిరినట్లు సమాచారం.

ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సుమారు 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు అభిషేక్ నామా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రతినిధులకు ప్రత్యేకంగా ప్రదర్శించిన తర్వాతే ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. సినిమా చూసిన తర్వాత కూడా ఈ స్థాయి ధర చెల్లించడంతో, ఈ చిత్రం కచ్చితంగా అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ మరియు జే2 సినిమాస్ బ్యానర్లపై నిషిత నాగిరెడ్డి, కిషోర్ అన్నపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అభిషేక్ టోలేటి సంగీతం అందిస్తున్నారు.

Next Story