ఆ విషయంలో పెద్ద రిస్క్ చేయనున్న 'నాగబంధం' మేకర్స్.. తేడా కొడితే కష్టమే?

by Pulgam srinivas |

'నాగబంధం'పై మంచి అంచనాల నేపథ్యంలో మేకర్స్ పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఆ విషయంలో పెద్ద రిస్క్ చేయనున్న నాగబంధం మేకర్స్.. తేడా కొడితే కష్టమే?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విరాట్ కర్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'నాగబంధం'. ఈ సినిమాను జూలై 3న విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్లను కూడా అదే రోజు ప్రదర్శించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో అనేక చిత్రాలకు పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్న విషయం తెలిసిందే. ప్రీమియర్ల ద్వారా సినిమాకు మంచి టాక్ వస్తే తొలి రోజు ఓపెనింగ్స్ భారీగా నమోదవుతున్నాయి. అదే నెగెటివ్ టాక్ వస్తే మొదటి రోజు కలెక్షన్లపై ప్రభావం పడుతోంది.

ప్రస్తుతం 'నాగబంధం'పై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రీమియర్లు లేకుండా నేరుగా విడుదల చేస్తే తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముందని, కానీ ప్రీమియర్లకు నెగెటివ్ టాక్ వస్తే ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో చిత్ర బృందం ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో నాభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించగా, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించారు.

Next Story