నాగబంధం : రూ. 20కోట్లతో క్లైమాక్స్ చిత్రీకరణ

by Sujitha Rachapalli |

యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న పాన్ ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి కిశోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలు. కాగా డివైన్, యాక్షన్, అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌తో మాసివ్‌ సినిమాటిక్ వండర్‌గా రూపొందుతోంది.

నాగబంధం : రూ. 20కోట్లతో క్లైమాక్స్ చిత్రీకరణ
X

దిశ, సినిమా : యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న పాన్ ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి కిశోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలు. కాగా డివైన్, యాక్షన్, అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌తో మాసివ్‌ సినిమాటిక్ వండర్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుండగా.. ఇందుకోసం రూపొందించిన భారీ సెట్‌కు రూ. 20 కోట్లు ఖర్చు చేశారు మేకర్స్. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా... విజువల్ వండర్‌గా చూపించేలా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ తన బృందంతో కలిసి సెట్‌లోని ప్రతి అంశాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించి, కథనం స్థాయిని మరింతగా పెంచేలా కేర్ తీసుకున్నారు. థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీ ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ రూపొందిస్తుండగా.. నభా నటేష్ , ఐశ్వర్యా మీనన్, జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Next Story