చర్చనీయాంశంగా మారిన నాగబాబు ట్వీట్.. అలాంటి పోస్ట్ పెట్టడానికి అసలు కారణం ఏంటంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-15 14:41:16  IST  )

మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) ఒకప్పుడు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఆయన గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

చర్చనీయాంశంగా మారిన నాగబాబు ట్వీట్.. అలాంటి పోస్ట్ పెట్టడానికి అసలు కారణం ఏంటంటే?
X

దిశ, సినిమా: మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) ఒకప్పుడు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఆయన గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, కొత్తగా ఎమ్మెల్సీ కూడా అయ్యారు. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తున్నారు. తాజాగా, నాగబాబు పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘‘ఏది వాస్తవమో.. ఏది భ్రమో అర్థం కాదు. మొదడులో నిక్షిప్తం అయినవన్నీ నిజాలుగా మనసు అద్దం చూపిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం అద్భుతంగా రుచి చూస్తుంది. కానీ మీరు కడుపు నిండి ఉన్నప్పుడు అదే ఆహారం సాధారణ రుచిగానే ఉంటుంది. మీరు విసుగు చెందినప్పుడు ఐదు నిమిషాలు అంతులేనిదిగా అనిపిస్తుంది. కానీ మీరు ఆనందించే పని చేస్తున్నప్పుడు అది ఎగిరిపోతుంది.

ఏదీ నిజం కాదు, ప్రతిదీ మీరు దానిని ఎలా గ్రహిస్తారో అదే. వేర్వేరు వ్యక్తులకు అదే విషయం పూర్తిగా భిన్నంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మెదడు మీకు సత్యాన్ని చూపించదు. మీరు నిజమని నమ్మేది అది మీకు చూపిస్తుంది. కాబట్టి, మీరు దురదృష్టవంతులు అని మీరు విశ్వసిస్తే.. మీరు అనర్హులుగా భావిస్తే లేదా మీరు విజయం సాధించలేరని మీరు అనుకుంటే.. మీ మెదడు దానిని సత్యంగా అంగీకరిస్తుంది. మీ జీవితం దానిని ప్రతిబింబిస్తుంది. మీరు విషయాలను చూసే విధానాన్ని మార్చుకోండి ప్రతిదీ మారుతుంది. జీవితంలో ఏదైనా — మీ అవగాహనను ఎలా మార్చాలో నేర్చుకోండి. మీ ఉపచేతనను తిరిగి మార్చుకోండి. జీవితంలో మీరు కోరుకునే ఏదైనా సొంతం చేసుకోండి’’ అని రాసుకొచ్చారు. అలాగే బాధగా సముద్రం వైపు చూస్తున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల పరంగా ఏదో జరగడం వల్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఇలాంటి పోస్ట్ పెట్టి ఉంటాడని అంతా అనుమానపడుతున్నారు.

Click For Tweet..

Next Story