విమాన ప్రమాదం నుండి బయటపడ్డ చిరంజీవి, సుస్మిత.. నాగబాబు ఎమోషనల్

by Ajay Maddhiboyina |

అహమ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ పై ఎమ్మెల్సీ, నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విమాన ప్రమాదం మనస్సుని కలచి వేసిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు

విమాన ప్రమాదం నుండి బయటపడ్డ చిరంజీవి, సుస్మిత.. నాగబాబు ఎమోషనల్
X

దిశ‌, వెబ్ డెస్క్: అహమ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ పై ఎమ్మెల్సీ, నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విమాన ప్రమాదం మనస్సుని కలచి వేసిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు .చాలా సంవత్సరాల క్రితం ఎంతో మంది సినిమా వాళ్లు ఉన్న చెన్నై ఫ్లైట్ తిరుపతి లో ఎక్కడో ల్యాండ్ అయ్యిందని చెప్పారు. అందులో తమ అందరికీ అత్యంత ప్రియమైన చిరంజీవి, ఆయన కూతురు సుస్మిత ఉన్నారన్నారు.ఫ్లైట్ తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయ్యిందని చెప్పారు. ఆ సమయంలో తన సోదరుడు ఆయన కూతురు ఎలా ఉన్నారో అన్న ఆందోలన చెందామని తెలిపారు. తరవాత విమానంలో అందరూ సేఫ్ అని తెలిసిందన్నాారు. దీంతో ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు.

ఆ విమాన ప్రమాదాన్ని ఇప్పటికీ మనసులో నుండి పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ క్రాష్ గురించి విజువల్స్ చూస్తుంటే గుండె తర్కుపోయిందని తెలిపారు. ఎంతోమంది యువకులు వాళ్ల భవిష్యత్ కోసం ఆశలతో ఫ్లైట్ ఎక్కారు..ఎంతమంది రిటైర్మెంట్ తరవాత జీవిత చరమాంకాన్ని అద్భుతంగా ఊహించుకుంటూ ఎక్కారో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ తల్లి తన బిడ్డల దగ్గరకి చేరాలని ఆత్రంతో ఫ్లైట్ ఎక్కారో, ముక్కుపచ్చలారని పసిపాపలు ఈ లోకం ఒకటుందని తెలియక కేవలం తల్లి పొత్తిళ్లలో సేఫ్ గా ఉన్నామనుకొన్న పసి బిడ్డలు ..ప్రయాణీకులని సేఫ్ డెస్టినేషన్ కి చేర్పించి తన ఆత్మీయులతో గడపాలని ఊహల్లో ఉన్న పైలట్ కో పైలేట్ ఇతర క్రూ మెంబర్స్. అసలు ఈ ఫ్లైట్ తో సంబంధం లేని మెడికో స్టూడెంట్స్ హాస్టల్ లో లంచ్ చేస్తుంటే పిడిగుపాటులా వాళ్ళ నెత్తిన పడిందని చెప్పారు.

ఏ మెడికో బిడ్డ ఎన్ని ఆశలతో డాక్టర్స్ అవుదామని చదువు కుంటున్నారో వాళ్ల జీవితాలు వాళ్ళ మీద ఆ తల్లిదండ్రులు ఎన్నెన్ని ఆసలు పెట్టుకున్నారో,,,,ఏమనాలో ఏమి ఆలోచించాలో కూడా తెలియని నిస్తేజ స్థితి అని అన్నారు. ఏడుపు రావటం లేదు గొంతు పూడుకు పోతుందని నాగబాబు ఎమోషనల్ అయ్యారు. దేవుడున్నాడని నమ్మే అన్ని మతాలవాళ్లు ఆ ఫ్లైట్ లో వుండే వుంటారని, ఈ దేవుళ్ళు ఏమైపోయారు ఎందుకు కాపాడలేకపోయారు అనిపిస్తుందని చెప్పారు.ఈ శతాబ్దానికి ఇంతకన్నా పెద్ద ఆపద రాదు రాకూడదు అంటూ నాగాబాబు కోరుకున్నారు.

Next Story