- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైవ్‌లోనే శ్రీలీలపై సెటైర్లు వేసిన నాగ వంశీ
డేట్లు సర్దుబాటు కాకపోవడంతోనే లెనిన్ నుండి శ్రీ లీల తప్పుకుందని తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, వరుస విజయాలు లేకపోయినా గ్లామర్‌తో పాటు అద్భుతమైన డాన్స్ ప్రతిభతో వరుస అవకాశాలను అందుకుంటోంది. అయితే ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో, కొందరు ఆమెను 'ఐరన్ లెగ్' అంటూ విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రంలో తొలుత శ్రీలీలనే హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. అయితే తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిన్న మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఆ సమయంలో ఓ పాత్రికేయుడు "ఈ సినిమాకు అన్ని మంచి పరిణామాలే జరుగుతున్నాయి. కొంతమంది తప్పుకున్నారు... కొన్ని మంచి విషయాలు జరిగాయి" అని వ్యాఖ్యానించారు.
దీనిపై నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ, "అంటే మీరు శ్రీలీల బ్యాడ్ అని అంటున్నారా?" అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, "మంచి సినిమాకు మంచే జరుగుతుంది. ఈ సినిమాకూ అలాగే జరిగింది. శ్రీలీల కేవలం డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అంతకుమించి మరే కారణం లేదు. ఇటీవల సినిమా చూశాను. ఇందులో భాగ్యశ్రీ అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఆమె కోసమే రాసినట్టుగా అనిపించింది" అని నాగ వంశీ వెల్లడించారు.






