- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సీజన్‌ను టార్గెట్ చేసిన నాగ వంశీ.. ప్రత్యేకంగా సినిమా ప్లాన్
వచ్చే సంక్రాంతి బరిలో తన నిర్మాణ సంస్థ నుంచి ఓ సినిమాను విడుదల చేయాలని నిర్మాత నాగవంశీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది ఈ పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు భారీ స్థాయిలో పోటీ పడుతుంటాయి. దీనికి ప్రధాన కారణం ఆ సమయంలో ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపడం. అందుకే సంక్రాంతి సమయంలో విడుదలైన చిత్రాల్లో యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధిస్తుంటాయి.
దీంతో మేకర్స్ తమ సినిమాలను ఈ సీజన్‌లో విడుదల చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే సంక్రాంతి సీజన్‌లో చిన్న సినిమాలకు థియేటర్లు దక్కడం చాలా కష్టంగా మారుతోంది. దీంతో ప్రముఖ నిర్మాతలు ఈ సీజన్‌లో తమ బ్యానర్ నుంచి కనీసం ఒక సినిమా విడుదలయ్యేలా ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయవంతంగా దూసుకుపోతున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చే సంక్రాంతి బరిలో తన నిర్మాణ సంస్థ నుంచి ఒక సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
అందులో భాగంగా ఇప్పటికే ఓ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించి శరవేగంగా పూర్తి చేసి సంక్రాంతి విడుదలకు సిద్ధం చేయాలని మేకర్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా నాగవంశీ నిర్మించిన ఏదో ఒక చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ వచ్చే సంక్రాంతికి ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.






