నయనతార సినిమాకు రివ్యూ ఇచ్చిన నాగవంశీ .. ఆసక్తికర ట్వీట్ వైరల్

by Mallepaka Hamsa |

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) , మాధవన్, సిద్ధార్థ్ కాంబోలో వచ్చిన మూవీ ‘టెస్ట్’.

నయనతార సినిమాకు రివ్యూ ఇచ్చిన నాగవంశీ .. ఆసక్తికర ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) , మాధవన్, సిద్ధార్థ్ కాంబోలో వచ్చిన మూవీ ‘టెస్ట్’. శశికాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మీరా జాస్మిన్(Meera Jasmine), మురుగదాస్, లిరిష్ రాఘవ, నాజర్, మోహన్ రామన్, వినయ్ వర్మ(Vinay Verma), కాళీ వెంకట్, కీలక పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రానికి సుమన్ కుమార్ కథ అందించగా.. వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి, రామచంద్ర, శశికాంత్ నిర్మించారు. ఇక ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చింది.

ఏప్రిల్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతుంది. దీంతో ‘టెస్ట్’ (test) చిత్రాన్ని సినీ సెలబ్రిటీలు సైతం చూస్తున్నారు. ఇక ఇండియాలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తుండటంతో అదే కాన్సెప్ట్‌తో వచ్చిన ‘టెస్ట్’ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా, ఈ సినిమాను చూసిన టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ‘‘IPL సమయంలో ఖచ్చితమైన సమయంలో ‘టెస్ట్’ విడుదల అయింది. ఇందులో నటుడు మాధవన్(R Madhavan), నయనతార, సిద్దార్థ్, మీరా జాస్మిన్ ఈ ఉత్కంఠభరితమైన రైడ్‌లో అద్భుతంగా నటించారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి’’ అని రాసుకొచ్చారు.

Next Story