- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ లో అరిచేసిన నాగవంశీ..వణికిపోయిన మీనాక్షి !
అనగనగా ఒక రాజుట్రైలర్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత నాగవంశీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: నవీన్ పోలిశెట్టి ( Naveen Polishetty ), మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు ( Anaganaga Oka Raju). సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 14న అంటే సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ వస్తోంది. అయితే సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మొత్తం కామెడీతో నిండిపోయింది. ఇందులో అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ రావడం అందరిని ఆకట్టుకుంటోంది.
అరిచేసిన నిర్మాత నాగ వంశీ ?
అనగనగా ఒక రాజు ( Anaganaga Oka Raju Trailer ) ట్రైలర్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత నాగవంశీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఈవెంట్ జరుగుతుండగా నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ఇద్దరు పక్కన నిర్మాత నాగ వంశి కూడా కూర్చున్నాడు. ఇక ఈవెంట్ చాలా సరదాగా కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా నాగ వంశీకి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన నాగ వంశీ, అవతలి వ్యక్తిపై గట్టిగా అరుస్తూ మాట్లాడాడు. అయితే ఒక్కసారిగా నాగవంశీ అరవడంతో, హీరోయిన్ మీనాక్షి చౌదరితో పాటు నవీన్ పోలిశెట్టి కూడా షాక్ అయ్యారు. ఈ వీడియో వైరల్ గా మారింది. క్లిక్






