- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నచ్చుతుందని నమ్మకం ఉంది.. బ్యాడ్ బాయ్ కార్తీక్‌పై నాగ శౌర్య కామెంట్స్
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ ఈవెంట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు హీరో నాగశౌర్య.

దిశ, సినిమా: హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌తో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్న సందర్భంగా మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. మా బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లలో చూసి ఆశీర్వదించాలి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. "ఆరెంజ్" సినిమా పాటలు విన్నప్పటి నుంచి హారిస్ జయరాజ్‌తో వర్క్ చేయాలని అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ అవకాశం వచ్చింది. ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. శ్రీదేవి గారు ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్‌లో ఇంకా మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. అంతే కాకుండా.. ఇందులో పనిచేసిన వెన్నెల కిషోర్, సముద్రఖని, సాయికుమార్, టీమ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరూ సినిమా చూసి మీకు నచ్చాలని కోరుకుంటున్నాను’ అన్నారు.






