నాగదుర్గ కొత్త పాట లాంచ్

by Sujitha Rachapalli |

శౌర్యా క్రియేషన్స్ బ్యానర్‌లో వస్తున్న ‘అమ్మోరు తల్లి’ సాంగ్ ఘనంగా లాంచ్ అయింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. అమాని, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటించిన పాటకు ఎమ్.ఎల్. రాజా సంగీతాన్ని అందించారు. కొరియోగ్రఫీ వేద

నాగదుర్గ కొత్త పాట లాంచ్
X

దిశ, సినిమా : శౌర్యా క్రియేషన్స్ బ్యానర్‌లో వస్తున్న ‘అమ్మోరు తల్లి’ సాంగ్ ఘనంగా లాంచ్ అయింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. అమాని, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటించిన పాటకు ఎమ్.ఎల్. రాజా సంగీతాన్ని అందించారు. కొరియోగ్రఫీ వేద చేయగా.. సినిమాటోగ్రఫీని పవన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నటి నాగదుర్గ మాట్లాడుతూ.. “ఈ పాట నా మునుపటి పాటలన్నిటి కంటే భిన్నంగా ఉంటుంది. ఈ పాట కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిని ఇస్తుంది” అని తెలిపింది. తనకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొని టీమ్‌ను అభినందించారు.

Next Story