Akkineni Nagarjuna: ఆ విషయంలో నాగార్జునని వెనక్కి నెట్టి.. తొలి అక్కినేని హీరోగా నాగ చైతన్య రికార్డు

by Phanindra |

మొదటి రోజు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది

Akkineni Nagarjuna: ఆ విషయంలో నాగార్జునని వెనక్కి నెట్టి.. తొలి అక్కినేని హీరోగా నాగ చైతన్య రికార్డు
X

దిశ, వెబ్ డెస్క్ : నాగచైతన్య ( Naga Chaitanya) హీరోగా ‘తండేల్’ ( Thandel ) చిత్రం ఎంత పెద్ద హిట్ కొట్టిందో మనందరికి తెలిసిందే. చందు మొండేటి ( Chandoo Mondeti ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి ( Sai Pallavi ) హీరోయిన్ గా నటించింది. మొదటి రోజు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్ళతో కనక వర్షం కురిపిస్తోంది. అంచనాలకు మించి సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో కెవ్వుమనిస్తోంది.

తాజాగా, ఈ చిత్రం ఓ రికార్డు క్రియోట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికి రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ను చేరింది. రిలీజ్ అయిన 9 రోజులకు ఈ మార్క్ ను అందుకుని అక్కినేని అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యేలా చేసింది. ఇక, చైతూ కెరియర్లో మొదటిసారి వంద కోట్లు సాధించడంతో సంతోషంగా ఉన్నాడు. వందలాది సినిమాలు తీసిన అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) కూడా ఈ మార్క్ ను ఇంత వరకు టచ్ చేయలేదు. అయితే, తండ్రిని కూడా వెనక్కి నెట్టి తొలి అక్కినేని హీరోగా నాగచైతన్య రికార్డు క్రియేట్ చేశాడు.ఈ చిత్రంలో నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో జీవించేశాడు. ఎమోషనల్ సీన్స్ అయితే అందర్ని ఏడిపించేశాయి. ఈ మూవీ హిట్ అవ్వడానికి దేవి శ్రీ ప్రసాద్ కూడా ఒక కారణం. అతను ఇచ్చిన మ్యూజిక్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది. " బుజ్జి తల్లి " పాట రిలీజ్ కు ముందే 100 మిలియన్ వ్యూస్ సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Next Story