Naga Chaitanya: ఫుడ్ బిజినెస్ట్‌లోకి అక్కినేని హీరో.. సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది అంటూ కామెంట్

by Chukka Sudharani |   (  Updated:2025-04-26 09:23:44  IST  )

అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) రీసెంట్‌గా వచ్చిన ‘తండేల్’ (Thandel)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

Naga Chaitanya: ఫుడ్ బిజినెస్ట్‌లోకి అక్కినేని హీరో.. సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది అంటూ కామెంట్
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) రీసెంట్‌గా వచ్చిన ‘తండేల్’ (Thandel)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే జోష్‌లో సినిమాలపై జోరు పెంచిన చైతూ.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో చేయబోతున్నాడు. ‘NC-24’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్‌తో కలిపి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ మూవీ ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇక సినిమా విషయాలు పక్కన పెడితే.. నాగచైతన్య ఫుడ్ బిజినెస్‌ (Food business)లో కూడా రాణిస్తున్న విషయం విదితమే. ఆయన కొన్నేళ్ల క్రితం నగరంలో ‘షోయు’ (Shoyu) పేరుతో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ ఆ రెస్టారెంట్ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ‘మా ‘షోయు’ రెస్టారెంట్‌లో రుచికరమైన వంటకాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రస్తుతం మా రెస్టారెంట్ సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది’ అని తెలిపారు. అలాగే ఇటీవల ‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా జపాన్‌కు వెళ్లిన ఎన్టీఆర్ (NTR) అక్కడ షోయు రెస్టారెంట్‌పై ప్రశంసలు కురిపించడంతో.. ఈ విషయంపై కూడా చైతూ స్పందిస్తూ.. ‘‘దేవర’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జపాన్‌కు వెళ్లిన ఎన్టీఆర్ మా రెస్టారెంట్ గురించి గొప్పగా చెప్పారు. ఆ వీడియో చూసి నేను ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story