Naga Chaitanya: అలాంటి సినిమాలు తీయమని చెబుతుంది.. శోభితపై నాగచైతన్య కామెంట్స్

by Chukka Sudharani |

అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల ‘తండేల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

Naga Chaitanya: అలాంటి సినిమాలు తీయమని చెబుతుంది.. శోభితపై నాగచైతన్య కామెంట్స్
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల ‘తండేల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ అందించిన ఈ చిత్రం తర్వాత చైతు స్పీడ్ పెంచి ప్రస్తుతం వరుస మూవీస్ అనౌన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో 24న చిత్రంగా రాబోతున్న ‘NC-24’తో ఫుల్ బిజీ అయిపోయాడు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు సమాచారం. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన భార్య శోభితపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘నేను ఇప్పుడు లవ్ స్టోరీలు చెయ్యాలి అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రేక్షకుల మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. వాళ్లు రెగ్యులర్ లవ్ స్టోరీల కంటే వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడతున్నారు. నేను కూడా అలాంటి సినిమాలు చేయాలని శోభిత చెప్పింది. ఆమె సలహాలు బాగుంటాయి. ఒక ప్రేక్షకురాలిగా సినిమాను చూసి ఎలా ఉందో, ఎలా ఉండాలో జెన్యూన్‌గా చెబుతుంది. అలాగే బాగోలేదు అంటే ముఖం మీదనే చెప్పేస్తుంది. అందుకే ఆమె సలహాలు ఎక్కువగా తీసుకుంటాను. శోభిత సోషల్ మీడియా ట్రెండ్‌ను ఎక్కువగా ఫాలో అవుతుంది. నా సినిమాల విషయంలో అదే నాకు బెస్ట్ అనిపిస్తుంది.. అందుకే ఆమె సలహాలు వింటాను’ అని చెప్పుకొచ్చాడు చైతు.

Next Story