- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శోభిత పుట్టిన రోజు...నాగ చైతన్య అదిరిపోయే ట్రీట్
శోభిత పుట్టిన రోజు ఉన్న తరుణంలో నాగ చైతన్య అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు చైతూ. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. హిట్స్, ఫ్లాఫ్స్ తో సంబంధం లేకుండా కొత్త తరహా కథలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి అక్కినేని నాగచైతన్య తాజాగా తన భార్య శోభిత ఫోటోలను షేర్ చేశారు. ఇవాళ శోభిత పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆమెకు స్పెషల్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకొని శుభాకాంక్షలు తెలిపారు. అన్ సీన్ ఫోటోలను షేర్ చేసి, అందరినీ సర్ ఫ్రైజ్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై లేడీ... నీతో కలిసి జీవితాన్ని పంచుకునే అవకాశం దక్కినందుకు నేను చాలా కృతజ్ఞుడిని అంటూ మనసులోని ప్రేమ అంతా కురిపించారు. పెళ్లి తర్వాత శోభిత జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావడంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కాగా సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత, శోభిత ప్రేమలో పడిపోయాడు అక్కినేని నాగచైతన్య. ఈ క్రమంలోనే ఏడాది కిందట శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు.






