- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Naga Chaitanya: మనసులో మాట బయటపెట్టిన నాగ చైతన్య.. అందులో భాగం కావాలనుందంటూ..
టాలీవుడ్ హీరో, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తనయుడు నాగ చైతన్య(Naga Chaitanya) మనందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తనయుడు నాగ చైతన్య(Naga Chaitanya) మనందరికీ సుపరిచితమే. ‘జోష్’(Josh) మూవీతో ఎంట్రీ ఇచ్చి.. ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో విజయం సాధించాడు. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ హీరోగా రాణిస్తున్నాడు. మంచి బ్లాక్ బస్టర్ విజయం కోసం నానా కష్టాలు పడుతున్నాడు. ఇక అతని పర్సనల్ విషయానికి వస్తే ‘ఏమాయ చేసావే’ సినిమా టైంలో హీరోయిన్ సమంత(Samantha)తో ప్రేమలో పడ్డాడు. అలా కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకున్న ఈ జంట.. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు.
అయితే మ్యారేజ్ అయిన 4 ఇయర్స్ వరకు బానే ఉన్న వారు.. సడెన్‌గా ఏం అయిందో ఏమో కానీ విడాకులు(Divorce) తీసుకున్నారు. దీంతో ఇటు సమంత ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు. ఇక డివోర్స్ తర్వాత చైతన్య స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డేటింగ్ చేసి రీసెంట్‌గా మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. కానీ సమంత మాత్రం మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడి సినిమాలకు దూరం అవ్వడమే కాకుండా మానసికంగా, శారీరకంగా ఒంటరిదయిపోయింది. కానీ, నిత్యం సోషల్ మీడియా(social Media)లో మాత్రం యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉండేది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చైతన్య చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వంలో ‘తండేల్’(Thandel) అనే సినిమా చేస్తున్నాడు. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్(Geetha Arts Banner) పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. అయితే ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రమోషన్ల జోరు పెంచింది. ఇందులో భాగంగా తాజాగా చెన్నై(Chennai) వేదికగా జరిగిన ఈవెంట్‌లో పాల్గొన్న నాగ చైతన్య లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(LCU) గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘ఎల్‌సీయూ నాకెంతో నచ్చింది. అందులో భాగం కావాలని నాకు ఎప్పటినుంచో ఉంది అని తన మనసులో ఉన్న మాటను చెప్పుకొచ్చాడు నాగచైతన్య. అలాగే హీరోయిన్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరితో సాయి పల్లవి మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. అందుకే ఆమెను అందరూ ప్రేమిస్తుంటారు, అలాగే ఆమెతో వర్క్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది’ అని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






