Naga Chaitanya: వృషకర్మ గ్లింప్స్ విడుదల టైం ఫిక్స్

by Pulgam srinivas |

నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా రూపొందుతున్న వృషకర్మ గ్లింప్స్ వీడియోను రేపు మధ్యాహ్నం 12:12 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్‌గా కనిపించనుండగా, లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ మూవీలో విలన్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా గ్లింప్స్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రేపు మధ్యాహ్నం 12:12 గంటలకి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈయన కొంత కాలం క్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా, సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన విరూపాక్ష అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.

ఆ మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానానికి గాను కార్తీక్ దండుకు ప్రశంసలు వెల్లువెత్తాయి. అంత గొప్ప విజయం తర్వాత ఈయన దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం వల్ల ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే, నాగచైతన్య 'తండెల్' లాంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఇందులో నటిస్తున్నాడు. దానితో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. రేపు విడుదల కాబోయే గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లయితే ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది.




Next Story