- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Naga Chaitanya: రూట్ మార్చిన నాగచైతన్య స్టార్ డైరెక్టర్‌తో మాస్ సినిమా.. అంచనాలను పెంచుతున్న ట్వీట్
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ‘ఏమాయ చేసావే’ చిత్రంతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ‘ఏమాయ చేసావే’ చిత్రంతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. మజిలీ, మనం, లవ్ స్టోరీ, వెంకీ మామ, బంగారు రాజు వంటి సినిమాలతో హిట్స్ సాధించారు. కానీ గత రెండేళ్ల నుంచి ఆయన ఫ్లాప్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇక ఈ ఏడాది ‘తండేల్’(Thandel) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నారు. ఇందులో ఆయన నటనలకు సినీ ప్రియులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు.
అయితే చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద రాణిస్తోంది. కానీ ఈ చిత్రాన్ని కూడా పైరసీ భూతం వదల్లేదు. విడుదలైన రోజే ఆన్‌లైన్‌లోకి రావడంతో ‘తండేల్’ టీమ్ జాగ్రత్త పడుతున్నారు. పైరసీ చేసిన వారిపై కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, నాగచైతన్య ఓ మాస్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీకి బోయపాటి శ్రీను (Boyapati Srinu)దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వావ్ సూపర్ కాంబో అని అంటున్నారు.
అయితే ఈ మూవీ షూటింగ్ ‘అఖండ-2’ పూర్తి అయిన తర్వాత స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, చైతు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరి కాపురం మున్నాళ్ల ముచ్చటగా అయింది. కొన్నేళ్లకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక చైతు శోభిత ధూళిపాళను ప్రేమించి పెద్దలను ఒప్పించి 2024 డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి చేసుకున్నారు. ఓ వైపు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో నటిస్తున్నారు.
Mass Film from #Akkineni Compound!#NagaChaitanya #BoyapatiSrinu #Akhanda2 #Thandel pic.twitter.com/xT6pqUN55A
— Crazy Buff (@CrazyBuffOffl) February 10, 2025






