తండేల్ ఎఫెక్ట్.. నక్క తోక తొక్కిన నాగచైతన్య! ఒకేసారి ముగ్గురు స్టార్ డైరెక్టర్స్‌తో..

by Chukka Sudharani |   (  Updated:2025-02-15 11:09:26  IST  )

అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) ‘తండేల్’ (Tandel )చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

తండేల్ ఎఫెక్ట్.. నక్క తోక తొక్కిన నాగచైతన్య! ఒకేసారి ముగ్గురు స్టార్ డైరెక్టర్స్‌తో..
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) ‘తండేల్’ (Tandel )చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. చైతన్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టి.. అక్కినేని హిస్టరినీ తిరగరాసిన ఈ మూవీకి చందూ మొడేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహించాడు. ఇందులో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi)హీరోయిన్‌గా నటించింది. మూవీ రిలీజ్‌కు ముందే సాంగ్స్‌తో హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ చిత్రం.. ఇక ప్రేమికుల రోజు(Valentine's Day) సందర్భంగా ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజై.. ఇప్పటికీ థియేటర్స్‌లో సందడి చేస్తూనే ఉంది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాతో నాగచైతన్య గ్రాఫ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో నాగచైతన్య నెక్ట్స్ ఎలాంటి మూవీస్ చేస్తాడో అని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే చైతు సినిమాలకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.

అందులో ఒకటి ఇప్పటికే కన్ఫార్మ్ అయింది. ‘తండేల్’ సక్సెస్ మీట్‌లో మరోసారి నాగచైతన్య, చందూ మొండేటీ కాంబో రిపీట్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. త్వరలో ఒక గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నట్లు.. అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) చేసిన తెనాలి రామకృష్ణ(Tenali Ramakrishna)కు మళ్లీ ఇప్పుడు ప్రేక్షకులను అర్థమయ్యే విధంగా మేకోవర్ చేసి సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. ఇక వీటితో పాటు.. ‘విరుపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు(Karthik Verma Dandu)తో మిస్టరీ థ్రిల్లర్ చిత్రం.. ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ఆర్కా మీడియా వర్క్స్‌(Arca Media Works)తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Next Story