- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలోనే సీక్వెల్ రాబోతున్నది.. సూపర్ అప్డేట్ ఇచ్చిన నాగచైతన్య
‘బంగార్రాజు’ సినిమా సీక్వెల్‌పై నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు.

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య త్వరలో ‘వృషకర్మ’తో రాబోతున్నాడు. ‘తండేల్’తో భారీ విజయం అందుకున్న తర్వాత చైతన్య నుంచి వస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తండ్రి నాగార్జునతో కలిసి సినిమా చేయడంపై ఓపెన్ అయ్యాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ఇందులో తండ్రీకొడుకులు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతున్నట్లు వార్తలు గత కొద్ది రోజులుగా వస్తుండగా.. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు నాగచైతన్య. ‘మిమ్మల్ని మళ్ళీ నాగార్జునతో తెరపై చూసే అవకాశం ఉందా?’ అని ప్రశ్నించగా.. ‘మేము ప్రస్తుతం బంగారురాజు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి మీరు మమ్మల్ని త్వరలోనే వెండితెరపై చూస్తారు’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కాంబినేషన్‌ను మరోసారి స్క్రీన్‌పై చూడబోతున్నామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.






