- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగ చైతన్య భార్య గురించి ఒక్క మాటలో చెప్పమంటే.. మళ్లీ సమంత ప్రస్తావన తెస్తారేంట్రా?
టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తున్నారు. లవ్‌స్టోరీ తర్వాత సాయి పల్లవితో ఈ సినిమాలో మరోసారి జతకట్టారు. తొలిసారి పాన్ ఇండియా రేంజ్‌లో చైతూ ఈ సినిమాను తీసుకొస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది. 'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా విజయం అందుకున్న యువ దర్శకుడు చందూ మొండేటి తండేల్‌ను తెరకెక్కించారు.
నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్(Geetha Arts) పతాకం మీద బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇదిలా ఉండగా.. నాగచైతన్య భార్య శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతో పాటు బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శోభితా ఇటీవల ఓ ఈవెంట్‌కు హాజరైంది. దీంతో ఇన్‌స్టాబాలీవుడ్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆమె ఫొటోలు, వీడియోలు పెట్టి.. శోభిత గురించి ఒక మాటలో చెప్పండి అంటూ పోస్టు పెట్టారు.
దీంతో నెటిజన్లు ఈమెను చూశాక సమంత(Samantha)పై గౌరవం పెరుగుతోందని.. సమంతే బెటర్ అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు శోభితకు సపోర్ట్ చేస్తూ కౌంటర్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, సమంత, నాగ చైతన్య గతేడాది అక్టోబర్ 2న ఈ జంట విడాకులు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. అనంతరం సుదీర్ఘ గ్యాప్ తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాలను 2024 డిసెంబర్ 4వ తేదీన వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియో వేదికగా వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.






