- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘KING100’తో ఏకంగా రాజమౌళికి షాక్ ఇచ్చిన నాగ్
నాగార్జున 100వ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తైనప్పటికీ, ఇప్పటివరకు ఒక్క లీక్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్న మూవీ టీంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అధికారిక టైటిల్‌ను ఇంకా ప్రకటించకపోవడంతో ప్రస్తుతం ఈ సినిమా ‘KING100’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన సుమారు 80 శాతం షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. అయితే ఇంత భారీ స్థాయిలో చిత్రీకరణ పూర్తైనప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి చిన్న పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేయలేదు.
ఇటీవల నాగార్జున సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు ఈ సినిమా నుంచి ఏదైనా ప్రత్యేక అప్డేట్ వస్తుందని ఆశించారు. అయితే ఆ సమయంలో కూడా చిత్రబృందం ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. అప్డేట్స్ లేకపోయినా నాగార్జున 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతటి క్రేజ్ ఉన్నప్పటికీ ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క చిన్న లీక్ కూడా బయటకు రాకపోవడం విశేషంగా మారింది.
దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాల షూటింగ్ విషయంలో ఎంత పకడ్బందీగా ఉంటారో తెలిసిందే. షూటింగ్ ప్రాంతాల్లో సెల్‌ఫోన్లపై కూడా కఠిన ఆంక్షలు ఉంటాయని తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. అయినప్పటికీ ఆయన చిత్రాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నాగార్జున 100వ సినిమా విషయంలో మాత్రం చిన్న లీక్ కూడా బయటకు రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో నాగ్ ఎంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్థమవుతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.






