రామ్ చరణ్‌తో సినిమాపై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Pulgam srinivas |

తాజాగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ... రామ్ చరణ్‌తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

రామ్ చరణ్‌తో సినిమాపై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వారిలో నాగ్ అశ్విన్ ఒకరు. తన వినూత్న కథలు, విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన తాజాగా సింగితం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందిన ‘సింగ్ గీతం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల నాగ్ అశ్విన్ ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొనగా, ఆయనకు రామ్ చరణ్ తో సినిమా చేసే ఆలోచన ఉందా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన ఆయన, “కచ్చితంగా రామ్ చరణ్‌తో సినిమా చేసే ఆలోచన ఉంది” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేశారా? అనే ప్రశ్నకు, “ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్‌లతోనే బిజీగా ఉన్నాను. ఇంకా రామ్ చరణ్‌ను సినిమా విషయమై కలవలేదు” అని తెలిపారు. ఇక రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా కథ సిద్ధం చేస్తారా? అనే ప్రశ్నకు నాగ్ అశ్విన్ స్పందిస్తూ, “ఇప్పటివరకు అలాంటి కథ ఏమీ సిద్ధంగా లేదు. కానీ ఆయనతో సినిమా ఫిక్స్ అయితే మాత్రం అద్భుతమైన కథను తయారు చేస్తాను” అని చెప్పారు.

Next Story