'డెకాయిట్'పై నాగ్ అశ్విన్ ప్రశంసలు

by Pulgam srinivas |

నాగ్ అశ్విన్ తాజాగా డెకాయిట్ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.

డెకాయిట్పై నాగ్ అశ్విన్ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన డెకాయిట్ చిత్రం నిన్న విడుదలై మంచి ప్రేక్షకాదరణను పొందుతోంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతుంది. తాజాగా ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరైన నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని చూసిన అనంతరం ఆయన మూవీ టీమ్‌ను అభినందించారు. నాగ్ అశ్విన్ తన స్పందనలో, ఈ చిత్రానికి అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా నిర్మాత సుప్రియా యార్లగడ్డ ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారని తెలిపారు. ఇక హీరో అడవి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటనపై ప్రశంసలు వ్యక్తం చేస్తూ, వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాను ఎంతో ప్రేమతో రూపొందించిన దర్శకుడు షనియెల్ డియోకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. సినిమా నిర్మాణంలో ప్రతి అంశం నాణ్యతతో రూపొందిందని, టీమ్ మొత్తం చేసిన శ్రమ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story