‘కల్కి-2’లో సాయి పల్లవి నటిస్తుండటంపై క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్.. షూటింగ్ అప్డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-16 05:39:09  IST  )

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధాలని ఆయన స్పష్టం చేశారు. ‘కల్కి’ కథ మొత్తానికి ‘సుమతి’ పాత్రే అత్యంత కీలకమని, అలాంటి పాత్రను తొలగించే ప్రసక్తే లేదని వెల్లడించారు.

‘కల్కి-2’లో సాయి పల్లవి నటిస్తుండటంపై క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్.. షూటింగ్ అప్డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ ఘన విజయంతో ప్రేక్షకుల్లో ‘కల్కి-2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలోనే మూవీ మేకర్స్ ‘కల్కి’ సీక్వెల్ రాబోతున్నట్లు ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు వెల్లడించారు. దీంతో గత కొద్దిరోజులుగా ఈ సీక్వెల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా పార్ట్-1లో కథను మలుపు తిప్పిన సుమతి పాత్రను రెండో భాగం నుండి తొలగిస్తున్నారని, ఒకవేళ ఉంచినా ఆ పాత్ర కోసం దీపికా పదుకోన్ స్థానంలో సాయి పల్లవిని హీరోయిన్‌ను తీసుకుంటున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు అసలు విషయాన్ని బయటపెట్టారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ‘కల్కి-2’ దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ పుకార్లను ఖండించారు.

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధాలని ఆయన స్పష్టం చేశారు. ‘కల్కి’ కథ మొత్తానికి ‘సుమతి’ పాత్రే అత్యంత కీలకమని, అలాంటి పాత్రను తొలగించే ప్రసక్తే లేదని వెల్లడించారు. అలాగే ఈ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండించారు. సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలను, ఇతర అప్‌డేట్స్‌ను సరైన సమయంలో అధికారికంగా వెల్లడిస్తామని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇక సినిమా షూటింగ్ గురించి చెబుతూ .. ఇప్పటికే ‘కల్కి-2’ చిత్రానికి సంబంధించి రెండు ముఖ్యమైన షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని నాగ్ అశ్విన్ వెల్లడించారు. అంతేకాకుండా, ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుండి సినిమా నాన్‌స్టాప్ షూటింగ్ జరుపుకోనుందని, శరవేగంగా మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి చిత్రబృందం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Next Story