- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్
భవిష్యత్తులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం ఉందా?" అని అడిగారు. దానికి నాగ్ అశ్విన్ ఏమాత్రం తడబడకుండా, చాలా స్పష్టంగా ఖచ్చితంగా చేస్తాను అని క్లారిటీ ఇచ్చారు.

దిశ, సినిమా: ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రస్తుతం దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఇందులో భాగంగా, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘సింగీతం’ పనుల్లో ఆయన ఫుల్ బిజీగా గడుపుతున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన అభిమానులు ఆయనను ఒక క్రేజీ ప్రశ్న అడిగారు. ఈవెంట్‌లో ఫ్యాన్స్ నాగ్ అశ్విన్‌ను చూసి.. "భవిష్యత్తులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం ఉందా?" అని అడిగారు. దానికి నాగ్ అశ్విన్ ఏమాత్రం తడబడకుండా, చాలా స్పష్టంగా ఖచ్చితంగా చేస్తాను అని క్లారిటీ ఇచ్చారు.
దాంతో ఒక్కసారిగా అక్కడున్న మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కల్కి లాంటి విజువల్ వండర్ తీసిన దర్శకుడు, రామ్ చరణ్‌తో సినిమా చేస్తానని చెప్పడం టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉండబోతుందనే విషయంపై కూడా నాగ్ అశ్విన్ మాట్లాడారు. ప్రస్తుతం తాను ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్టుల స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నానని తెలిపారు. అవన్నీ అనుకున్నట్లు పూర్తి అయిపోయిన తర్వాత.. రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు, ఆయన ఇమేజ్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం బయోపిక్స్ తీసే ఆలోచనలు లేవని అన్నారు. నాగ్ అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.






