Nabha Natesh: నలుపు రంగు పలుచటి చీరలో హార్ట్ బీట్ పెంచుతున్న క్యూట్ హీరోయిన్

by Pulgam srinivas |

నలుపు రంగు పలుచటి చీరలో సైడ్ యాంగిల్ స్టిల్స్‌తో కుర్రాళ్ల హార్ట్‌బీట్ పెంచుతున్న నభా నటేష్.

Nabha Natesh: నలుపు రంగు పలుచటి చీరలో హార్ట్ బీట్ పెంచుతున్న క్యూట్ హీరోయిన్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వేగంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో నభా నటేష్ ఒకరు. ఈ యువ హీరోయిన్‌కు ఇస్మార్ట్ శంకర్ చిత్రం ద్వారా మొదటి పెద్ద విజయం దక్కింది. ఆ సినిమా సక్సెస్‌తో వరుసగా ఈమెకు అవకాశాలు దక్కడం ప్రారంభమైంది.




అలాంటి సమయంలోనే ఈమెకు రోడ్ యాక్సిడెంట్ జరగడంతో కొంతకాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దాంతో సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్న ఈ నటి, మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కెరీర్‌ను జెట్ స్పీడ్‌లో ముందుకు తీసుకెళ్తోంది. ప్రస్తుతం ఈమె స్వయంభు, నాగబంధం అనే రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.




ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు చిత్రాలు విజయాలు సాధిస్తే, ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికి చేరే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాల్లో మాదిరిగానే ఈమె సోషల్ మీడియాలో కూడా తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది.




తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ యువ నటి లైట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో ఎంబ్రాయిడరీ కలిగిన పలుచటి శారీ ధరించి, దానికి తగిన స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో స్టైలిష్‌గా కనిపించింది.




ఈ ఫోటోలలో ఒక చేతికి బ్లాక్ బ్యాంగిల్స్ వేసుకొని, తన కురులను ఆకర్షణీయంగా ముందుకు వేసి నవ్వుతూ సైడ్ మరియు ఫ్రంట్ యాంగిల్స్‌లో స్టిల్స్ ఇచ్చింది. ఈ లుక్‌లో ఈ బ్యూటీ చాలా గార్జియస్‌గా కనిపించడంతో, ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story