- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nabha Natesh: ఎప్పటికీ రుణపడి ఉంటా.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
యంగ్ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh) ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh) ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇందులో నిఖిల్ ‘స్వయంభు’(Swayambhu)తో పాటు, మరో ప్రతిష్టాత్మక చిత్రం నాగబంధంలో ఆమె నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా (Pan India) రేంజ్‌లో తెరకెక్కుతుండటంతో.. ఈ మూవీస్‌తో నభా కెరీర్ కూడా ఓ మలుపు తిరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక వీటితో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్‌లో పెట్టంది నభా. ఇదిలా ఉంటే.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలకు, ప్రకృతికి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది ఈ హీరోయిన్. ‘ఈ రోజు నేను ఒక చెట్టును కౌగిలించుకున్నాను.. ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకున్నట్లు అనిపించింది. అలాగే.. నిజంగా ఈ భూవీ నాకు నిశ్శబ్దంగా అనుమతి ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ అందమైన ప్రపంచాన్ని ఆస్వాదించడానికి మనం కేవలం అతిథులం. ప్రకృతి మనకు అనేక అద్భుత అనుభవాలను అందిస్తోంది. ఈ పర్యావరణాన్ని, ప్రకృతిని అనుభవించడమే మన హక్కు. ఈ సంతోషాన్ని, అనుభూతిని అందించిన నేచర్‌కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను’






