Nabha Natesh: ఆ సమయంలో నరకం చూశాను.. వాటితోనే కాలం గడిచింది

by Pulgam srinivas |   (  Updated:2026-07-04 05:40:51  IST  )

కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో జరిగిన ప్రమాదంతో కొంతకాలం సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని నభా నటేష్ వెల్లడించింది.

Nabha Natesh: ఆ సమయంలో నరకం చూశాను.. వాటితోనే కాలం గడిచింది
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ, తక్కువ సమయంలోనే తన అందం, నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ విజయవంతంగా సాగుతున్న సమయంలోనే ఆమె అనూహ్యంగా కొంతకాలం పాటు సినిమాలకు దూరమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నభా, తన కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఎందుకు సినిమాలకు విరామం ఇవ్వాల్సి వచ్చిందో వెల్లడించింది.

నభా నటేష్ మాట్లాడుతూ.. "కొంతకాలం క్రితం మెట్లపై నుంచి జారి కింద పడిపోయాను. తలకు దెబ్బ తగలకుండా ఉండేందుకు పక్కకు పడటంతో నా పక్కటెముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శరీరంలో రాడ్లు, స్క్రూలు అమర్చాల్సి వచ్చింది. డాక్టర్లు కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ సమయంలో నేను నాలుగు, ఐదు సినిమాల్లో నటిస్తున్నాను. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం వల్ల సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ఆ రోజులు నాకు నిజంగా నరకం లాంటివి.

అయితే ఆ కష్టకాలాన్ని వృథా చేయకుండా పెయింటింగ్ చేయడం, పాటలు పాడటం, శిల్పకళ (స్కల్ప్చింగ్), పుస్తకాలు చదవడం, ప్రయాణాలు చేయడం వంటి పనులతో గడిపాను. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మానసికంగా, శారీరకంగా మరింత బలంగా మారాను" అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే నభా నటేష్ మళ్లీ సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలను అందుకుంటోంది. తాజాగా ఆమె నటించిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

Next Story