మాస్ స్టెప్స్‌తో డ్యాన్స్‌ ఇరగదీసిన నభా నటేష్.. అదిరిపోయింది అంతే అంటూ కామెంట్స్

by I. Sairam |

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మాస్ స్టెప్స్‌తో డ్యాన్స్‌ ఇరగదీసిన నభా నటేష్.. అదిరిపోయింది అంతే అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(adhugo) చిత్రంలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘డిస్కో రాజా’(disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke so Better), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ మూవీలో నటిస్తోంది.

అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో బ్లాక్ అవుట్ ఫిట్‌లో మాస్ స్టెప్స్‌తో డ్యాన్స్ ఇరగదీసింది. తన ఒంపు సొంపులతో ఖతర్నాక్‌గా డ్యాన్స్ చేసింది. ఇక ఈ వీడియో.. ‘మళ్లీ ఈ వీడియోను రీపోస్ట్ చేశాను.. ఎందుకంటే ఈరోజు కూలీ డే’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు అదిరిపోయిందంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story