Minister Seethakka: మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్

by Chukka Sudharani |   (  Updated:2024-11-30 16:31:02  IST  )

మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నారి’ (Nari).

Minister Seethakka: మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్
X

దిశ, సినిమా: మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నారి’ (Naari). సూర్య వంటిపల్లి (Surya Vantipalli) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి (Sashi Vantipalli) నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘నారి’ మూవీ డిసెంబర్ (December) 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ఈ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క (Minister Sitakka) మాట్లాడుతూ.. ‘మహిళలు ఎన్నో రంగాల్లో ఎదుగుతున్నప్పకీ.. వారి పట్ల వివక్ష, చిన్నచూపు తగ్గడం లేదు. సమాజ నిర్మాతలు మహిళల అనే నిజాన్ని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఆడ పిల్లలు ఎదిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి. మహిళల్ని గౌరవించాలి. ఇలాంటి గొప్ప కాన్సెప్ట్‌తో ‘నారి’ సినిమా చేసిన సూర్య వంటిపల్లికి అభినందనలు. ఈ సినిమా పోస్టర్, గ్లింప్స్ నా చేతుల మీదుగా విడుదల చేసుకోవడం సంతోషంగా ఉంది. నారి సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. మహిళల గురించి వారి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.

Read More...

OG: పవన్ కల్యాణ్ ‘OG’లో ప్రభాస్.. ఆల్రేడీ డేట్స్ ఇచ్చేసిన డార్లింగ్..!


Next Story