- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా తెలుగోడు..
డ్రీమ్ టీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హరనాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వం, నిర్మాణంలో వస్తున్న ‘నా తెలుగోడు’ డిసెంబర్ 12న విడుదల కానుంది. హరనాథ్ పోలిచర్ల హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నైరా పాల్, రోనీ కౌలా,

దిశ, సినిమా : డ్రీమ్ టీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హరనాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వం, నిర్మాణంలో వస్తున్న ‘నా తెలుగోడు’ డిసెంబర్ 12న విడుదల కానుంది. హరనాథ్ పోలిచర్ల హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నైరా పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ కీలక పాత్రలు పోషించారు. మల్లి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, శివ సంగీతం సమకూర్చారు. రమణ ఎడిటింగ్ చేయగా, చంద్ర బోస్, గడ్డం వీరు పాటలు రచించారు. విడుదల తేదీ దగ్గరవుతున్న సమయంలో ఈ చిత్ర బృందం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరనాథ్ పోలిచర్ల.. ‘‘నా తెలుగోడు’ విషయానికి వస్తే రామారావు గారు నాకు దైవ సమానులు. ఆయన ఆశీర్వాదంతో ఈ సినిమా చేశాను. తెలుగోడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎలా మంచి కోసం పోరాడేవాడు, ప్రతిభావంతుడు, కష్టపడేవాడు అనేది చూపించాను. ఈ సినిమాలో ప్రత్యేకంగా నాలుగు అంశాలను చూస్తాము. అమ్మ, డ్రగ్స్‌పై అవగాహన, సైనికుడు జీవితం, బాల శిశువులను కాపాడే ప్రయాణం ఈ సినిమాలో చూడబోతున్నాము. ఈ అంశాలు అన్నింటినీ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ఈ సినిమాలో చూస్తాం. ఈ సినిమా కోసం నా చిత్ర బృందం అందరూ నాకు ఎంతో అండగా నిలబడ్డారు. శివ మంచి సంగీతాన్ని అందించారు. ప్రేక్షకులు అందరూ డిసెంబర్ 12వ తేదీన సినిమాను చూసి, ఇందులోని అంశాలను మీ మనసులోకి తీసుకుంటారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. కార్యక్రమానికి హీరోయిన్ సుఫియా తన్వీర్, హీరోయిన్ నైరా పాల్, దర్శకులు స్వరూప్, శివ నిర్వాణ, మహేష్ బాబు, మైత్రి నవీన్ తదితరులు హాజరయ్యారు.






