కపుల్ ఫ్రెండ్లీ నుంచి ‘నా ప్రాణమా’ సాంగ్ రిలీజ్.. రొమాన్స్‌తో రెచ్చిపోయిన హీరోహీరోయిన్

by I. Sairam |

యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Soban) చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

కపుల్ ఫ్రెండ్లీ నుంచి ‘నా ప్రాణమా’ సాంగ్ రిలీజ్.. రొమాన్స్‌తో రెచ్చిపోయిన హీరోహీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Soban) చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అందులో భాగంగానే కపుల్ ఫ్రెండ్లీ (Couple Friendly) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అశ్విన్ చంద్రశేఖర్(Ashwin Chandrashekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండగా.. అజయ్ కుమార్ రాజు పి నిర్మించారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన మానస వారణాసి (Manasa Varanasi) నటించింది. ఇప్పటికే కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

వాలెంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న కపుల్ ఫ్రెండ్లీ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ నా ప్రాణమా సాంగ్ రిలీజ్ అయింది. హీరో హీరోయిన్ రొమాన్స్‌తో సాగే ఈ పాట లిరీక్స్ లవ్ బర్డ్స్‌ను ఆకట్టుకున్నాయి. కాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A 'A'(Adults Only) సర్టిఫికెట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే అ మూవీ రన్ టైమ్ 2 గంటల 1 నిమిషం (121 నిమిషాలు).

Next Story