- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధం జరుగుతుండగా ఇరాన్‌లో నా అన్వేషణ.. ఆయన పరిస్థితి చూసి ఆందోళనలో ఫ్యాన్స్..
ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ప్రస్తుతం ఇరాన్‌లో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూపాయి మాత్రమేనని.. నీరు మాత్రం లీటర్‌కు ఆరు రూపాయలు అని.. అంత డిమాండ్ ఉందని తెలిపాడు

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ప్రస్తుతం ఇరాన్‌లో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూపాయి మాత్రమేనని.. నీరు మాత్రం లీటర్‌కు ఆరు రూపాయలు అని.. అంత డిమాండ్ ఉందని తెలిపాడు. పక్క దేశాల్లో ఫ్యూయల్ లేక ఇబ్బందులు పడాలని.. రేట్లు పెరగాలని.. ఇక్కడ ఇంత చీప్‌గా అమ్ముతారని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమేయం గురించి కూడా వివరించాడు. ఇదంతా బాగానే ఉన్నా.. నా అన్వేషణ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుందట కదా అక్కడకు ఎందుకు వెళ్లావని అడుగుతున్నారు. ఓ పక్క యుద్ధం జరుగుతుంటే ఈ వీడియోలు అవసరమా అంటూనే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఏంటో జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. త్వరగా అక్కడి నుంచి మరో చోటకు వెళ్లమని జాగ్రత్తలు చెప్తున్నారు. అయితే ఇంకొందరు అంత చీప్ ధరలు ఉన్నాయా అక్కడ.. వచ్చేటప్పుడు ఓ వెయ్యి లీటర్లు తీసుకొచ్చేయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






